- హాజరైన భారత క్రికెట్ జట్టు సభ్యలు, క్రీడా ప్రముఖులు
భువనేశ్వర్, నుపూర్‌ల వివాహ రిసెప్షన్ సందడిగా జరిగింది. భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్న భువనేశ్వర్ తన ప్రేయసి నుపూర్‌ను మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో సంప్రదాయ పద్ధతిలో నవంబర్ 24వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆ సమయంలో టెస్టు మ్యాచ్‌లు ఉండడంతో భారత క్రికెట్ జట్టు సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. వారందరి కోసం దేశ రాజధాని ఢిల్లీలోని తాజ్ మహాల్ హోటల్‌లో మంగళవారం వివాహ రిసెప్షన్ నిర్వహించారు.
ఈ వేడుకకు భారత క్రికెట్ జట్టులతో పాటు మాజీ క్రీడాకారులు, ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, చటేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లి వలన భువనేశ్వర్ రెండు టెస్టులకు దూరమయ్యాడు.
