Friday, April 26, 2024
- Advertisement -

వినాయక్ లేకుండానే.. అఖిల్ సినిమా షూటింగ్ జరిగిపోతోంది!

- Advertisement -

దర్శకుడు వి.వి. వినాయక్ ఇండియాలో ఉన్నాడు. ఈయన తీరికగా సినిమా ఫంక్షన్లలో పాలు పంచుకొన్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మాత్రం స్పెయిన్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది! మరి దర్శకుడు ఇండియాలో ఉంటే.. సినిమాను స్పెయిన్ లో ఎలా రూపొందిస్తున్నారనేదే అంతుబట్టని విషయంగా మారిందిప్పుడు!

అక్కినేని అఖిల్ ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాపై అక్కినేని ఫ్యామిలీ చాలా ఆశలు పెట్టుకొంది. నాగ చైతన్య కెరీర్ అంత గొప్పగా లేని తరుణంలో అఖిల్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని ఆ ఫ్యామిలీ భావిస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ అభిమానులే కాకుండా.. అఖిల్ ను ఫస్ట్ లుక్ తోనే అభిమానిస్తున్న వారు కూడా ఈ సినిమాపై ఆసక్తిని కలిగి ఉన్నారు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకొంది. ప్రస్తుతానికి స్పెయిన్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే దర్శకుడు వినాయక్ మాత్రం ఇండియాలో ఉన్నాడు. ఆయన ఇక్కడ తన సన్నిహితులతో కనిపిస్తుండగా.. స్పెయిన్ ఉన్నాడు అఖిల్. అక్కడ యాక్షన్ పార్టుల చిత్రీకరణ జరుగుతోందని ఈ సినిమా యూనిట్ చెబుతోంది. మరి దర్శకుడు లేకుండానే సినిమా షూటింగ్ జరుగుతుండటం ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -