Friday, May 10, 2024
- Advertisement -

జూనియ‌ర్ ధోనీ (రిష‌బ్‌పంత్‌) ఇలా అయితే క‌ష్టం….

- Advertisement -

వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ పక్కకి తప్పుకుంటే.. అతని స్థానాన్ని జట్టులో భర్తీ చేసే క్రికెటర్ ఎవరు అనేది ఏడాదికాలంగా వినిస్తున్న ప్ర‌శ్న‌కు ప్ర‌తీసారీ వ‌చ్చే స‌మాధానం రిషబ్ పంత్ పేరు. మైదానంలో ఒత్తిడి దరిచేరనీయకుండా స్వేచ్ఛగా హిట్టింగ్ చేయగల నైపుణ్యం, 20 ఏళ్ల యువ క్రికెటర్ కావడంతో మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం రిషబ్ పంత్‌కు అవకాశమివ్వాలని పట్టుబడుతున్నారు.

ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించే ఈ యువ హిట్టర్.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడగా.. శ్రీలంకపై 23 పరుగులు, బంగ్లాదేపై స్వ‌ల్ప పరిమితమయ్యాడు. కెరీర్లో ఇప్పటి వరకు నాలుగు టీ20లు ఆడినా పంత్ చేసింది 73 పరుగులే. ఇందులో అత్యధిక స్కోరు 38 మాత్రమే.

గురువారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ టార్గెట్ 140 పరుగులే కావడంతో.. జట్టుపై ఒత్తిడి తక్కువగా ఉంటుంద‌నే దుద్దేశంలో రిషబ్‌కు స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ ఆర్డర్లో అతడ్ని ఒక స్థానం ముందుకు జరిపి మూడో స్థానంలో పంపించారు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ విసిరిన యార్కర్ బంతి (తాను ఎదుర్కొన్న రెండో బంతి)ని కళ్లు చెదిరే రీతిలో లాంగాన్ దిశగా బౌండరీకి తరలించిన రిషబ్ పంత్.. తర్వాత ఓవర్లోనే రుబెల్ హుస్సేన్ బౌలింగ్లో బంతిని వికెట్లపైకి ఆడుకుని బౌల్డయ్యాడు. ఆఫ్ స్టంప్కి దూరంగా వెళ్తున్న బంతిని ఫుట్వర్క్ లోపం కారణంగా రిషబ్ వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో.. వరుసగా రెండో మ్యాచ్లోనూ అతను నిరాశపరిచినట్లైంది. సోమవారం శ్రీలంకతో జరగనున్న మూడో టీ20 మ్యాచ్లోనైనా ఈ జూనియర్ ధోని సత్తాచాటుతాడేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -