నాగార్జున తనయుడి తొలి సినిమా “అఖిల్” డిస్ట్రిబ్యూటర్స్ ను భయపెడుతోంది. ఈ సినిమా నిర్మాతలు చెబుతున్న థియేటరికల్ రైట్స్ ధరలు వాళ్లను బెంబేలెత్తిస్తున్నాయి.
కుర్ర హీరో ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా తీరున కాకుండా.. అత్యంత భారీ స్థాయిలో పలుకుతున్నాయి ఈ సినిమా ధరలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. అఖిల్ సినిమా ఏపీ హక్కులు దాదాపు 17 కోట్ల రూపాయల స్థాయిలో ఉండగా.. తెలంగాణ ప్రాంత ధరలు దాదాపు 14 కోట్ల రూపాయలు చెబుతున్నారు.
అయితే ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టే ధైర్యం ఎంత మంది పంపిణీ దారులకు ఉంటుందనేదే ఇక్కడ సందేహం. ఎంతకాదనుకొన్నా అఖిల్ కొత్తహీరో. ఈ సినిమాతోనే పరిచయం అవుతున్న హీరో. అలాంటి హీరో సినిమా రైట్స్ ను దాదాపు ముప్పై కోట్ల రూపాయల స్థాయిలో చెబుతున్నారు. ఒకవేళ ఇదే స్థాయి బిజినెస్ అయితే అది గొప్పసంగతే. ఈ రైట్స్ కు తోడు విదేశీ హక్కులు… శాటిలైట్ రైట్స్ ఉండనే ఉంటాయి కాబట్టి.. అఖిల్ సినిమా భారీ స్థాయిలో మార్కెట్ చేసినట్టు అవుతుంది. కానీ ఇంత ఖర్చు పెడితే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వస్తారా? అనేదే అనుమానం!
ఈ సినిమాకు నితిన్ ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. వారు ఈ ధరలను ఫిక్స్ చేసి డిస్ట్రిబ్యూటర్లను భయపెడుతున్నారు. మరి అంతిమంగా ఈ సినిమా హక్కులు ఎంతకు అమ్ముడవుతాయో చూడాలి!