Monday, May 13, 2024
- Advertisement -

పీవీపీ ఆదుకుంటే దేవుడు

- Advertisement -

రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినా సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యింది. అయితే ఈ క్రమంలో సినిమాను భారీ రేటుకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాస్ భరించాల్సి వస్తుంది.

రిలీజ్ కు ముందే లాస్ వచ్చినా తనకు ఎలాంటి సంబంధం లేదు అన్న అగ్రిమెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి వారు మహేష్ ను గాని, పివిపిని గాని అడిగే అవకాశం ఉండడు. ఇక రీసెంట్ అప్డేట్ ఏంటంటే పివిపి డిస్ట్రిబ్యూటర్స్ అందరికి అభయం ఇచ్చాడట. తన వల్ల ఎవరు నష్టపోకూడదని లాస్ లో 50 శాతం రిటర్న్ ఇచ్చేస్తానని అన్నాడట పివిపి.

మరి ఈ లాస్ లో మహేష్ ఎంత భరిస్తాడో చూడాలి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమా రిలీజ్ ముందే భారీగా అమ్మేసుకుని చేతులు దులుపుకుంటున్న ఈ తరుణంలో తన బ్యానర్ వాల్యూ చెడిపోకూడదని పివిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇదో మెచ్చుకోదగ్గ విషయమే అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -