Wednesday, May 1, 2024
- Advertisement -

హీరోయిన్ లేకున్నా షూట్ కి సై అన్న అఖిల్

- Advertisement -

అఖిల్ అక్కినేని.. మిస్టర్ మజ్ను సినిమా విజయం సాధిస్తుంది అనుకుంటే ఆ సినిమా కాస్త చితికలో పడి తన ఆశల పై నీళ్ళు జల్లింది. వెంకీ అట్లూరి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రాణించడం లో విఫలం అయింది. ఆ తరువాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్న అఖిల్ కు నాగార్జున ఒక మంచి ప్రాజెక్ట్ సెట్ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యం లో రానున్న చిత్రం లో అఖిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబందించిన ప్రే ప్రొడక్షన్ వర్క్స్ ప్రస్తుతం చివరి స్టేజ్ లోకి వచ్చాయి. అయితే ముందు నుండి ఒక పెద్ద హీరోయిన్ ని ఈ సినిమా లో అఖిల్ సరసన నాయిక గా నటింపజేయాలని దర్శక నిర్మాతలు భావించినా వారు కావాలి అనుకున్న వారెవరూ సినిమా చేయడానికి ముందు కు రాలేదు. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ దశకి చేరుకోవడం తో హీరోయిన్ ఎంపిక ఇంకా ముగియకముందే ఎలాగైనా షూట్ అయితే ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారట.

హీరోయిన్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టి RRR స్టయిల్ లో ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాక అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ ని సినిమా లోకి తీసుకుందాం అనే ఉద్దేశం లో దర్శకనిర్మాతలు ఉన్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా కి సంబంధించిన మొదటి షెడ్యుల్ వచ్చే నెల మొదలు అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -