Sunday, May 5, 2024
- Advertisement -

బిగ్ బాస్ షో పై నాగార్జున ద్వంద్వ వైఖరి

- Advertisement -

ఎట్టకేలకు అన్నీ పుకార్లని నిజం చేస్తూ, మిగిలిన వార్తలకి చెక్ పెడుతూ, స్టార్ మా మేనేజ్మెంట్ మరియు బిగ్ బాస్ షో నిర్వాహకులు నిన్న సాయంత్రం నాగార్జున అక్కినేని మూడో సీజన్ ని హోస్ట్ చేయనున్నారు అనే వార్త ని అధికారికం గా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతోంది. నాగార్జున నటించిన ఒక ప్రోమో ని విడుదల చేస్తూ ఈ సారి రంగం లో కి దిగేది నాగార్జున అనే విషయాన్ని షో నిర్వాహకులు తెలియజేసారు. కాకపోతే ఇప్పుడు కొంత మంది నాగార్జున పూర్వం బిగ్ బాస్ షో పై చేసిన వ్యాఖ్యలని, ఇప్పుడు ఆయన షో లో హోస్ట్ గా చేస్తున్నప్పుడు ప్రోమో లో చెప్పిన మాటలని కంపేర్ చేస్తూ అయన ద్వంద్వ వైఖరి ని ఎత్తి చూపుతున్నారు.

అయితే గత ఏడాది అయన నటించిన దేవదాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ షో గురించి మాట్లాడమని అడిగినప్పుడు, “ఆ షో గురించి నన్ను అడగకండి. నాకు బూతులు వస్తాయి.” అన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి షో లో హోస్ట్ గా ఉండటమేంటి అని అందరూ కామెంట్ చేస్తున్నారు. నిజం గా ఇంట్రెస్ట్ తో నాగార్జున ఈ షో ని హోస్ట్ చేయడం లేదు అనేది వారి వాదన. మరి నాగార్జున ఈ కామెంట్స్ పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -