Friday, May 10, 2024
- Advertisement -

చూపిస్తే చూడ‌టానికి మీకు ఏం బాధ – అక్ష‌ర్ హాస‌న్‌

- Advertisement -

లోక‌నాయ‌కుడు పేరుగాంచిన క‌మ‌ల్ హాస‌న్ కూతురు అక్ష‌ర హాస‌న్ ప‌ర్స‌న‌ల్ ఫోటోలు కొద్ది రోజులు క్రితం సోష‌ల్ మీడియాలో హల్ చ‌ల్ చేశాయి.టూ పీస్ బికినితో ఉన్న అక్ష‌ర హాస‌న్ ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో క‌మ‌ల్ అభిమానులు అందోళ‌న చెందారు.అక్ష‌ర హాస‌న్ త‌న రూమ్‌లో దిగిన ప‌ర్స‌న‌ల్ ఫోటోలు బ‌య‌టికి ఎలా వ‌చ్చాయో ఎవ‌రికి అర్థం కాలేదు.తాజాగా ఈ ఫోటోలు బ‌యటికి రావడంపై స్పందించింది.”ఆ ఫోటోలు లీక్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ సినిమా ఫోటో షూట్ సందర్భంగా తీసుకున్న స్టిల్స్ అవి. కావాలని తీసుకున్న ఫోటోలు కాదు. అయినా ఆ స్టిల్స్ లో తప్పేముంది.

మరోసారి అలాంటి ఫోటోలు తీసుకోవడానికి కూడా నేనేం వెనుకాడను. అయినప్పటికీ ఈ ఫోటోలు లీక్ అవ్వడంపై పోలీసులకి కంప్లైంట్ చేస్తాను” అంటూ వెల్లడించింది. అలా ఫోటోలు తీసుకోవడంలో తప్పు లేదంటూనే పోలీసులకు ఫిర్యాదు మాత్రం చేస్తానంటోంది. ఫోటో షూట్ టైమ్ లో తీసిన స్టిల్స్ లో కొన్నింటిని మాత్రమే వాడుకోవాలని, మిగిలిన స్టిల్స్ ని తొలగించాలని కానీ అలా చేయకుండా ఇలా ఇంటర్నెట్ లో పెట్టడం కరెక్ట్ కాదని అంటోంది. తన పర్మిషన్ తీసుకోకుండా ఇలా చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటోంది. ఆ ఫోటోల‌లో త‌ప్పు లేనప్పుడు ఇంకా పోలీసుల‌కు ఫిర్యాదు ఎందక‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -