Saturday, May 18, 2024
- Advertisement -

త‌న‌కు ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి కంగ్రాట్స్ చెప్పిన మ‌హేశ్ బాబు

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సినిమాల‌తో పాటు ,తాజా సినిమాల‌పై కామెంట్స్ చేస్తుంటారు.తాజాగా విడుద‌ల అయిన త‌మిళ స్టార్ హీరో విజ‌య్ స‌ర్కార్ మూవీపై స్పందించాడు మ‌హేశ్‌.సినిమా చాలా బాగుంద‌ని ,విజ‌య్ యాక్టింగ్ సూప‌ర్బ్ అని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు మ‌హేశ్ బాబు.ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఏఆర్‌.మురుగ‌దాస్‌పై కూడా ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు మ‌హేశ్‌.మురుగ‌దాస్ సార్ సినిమాను చాలా బాగా తెర‌క్కించార‌ని చెప్పుకొచ్చాడు మ‌హేశ్‌.

మ‌హేశ్ బాబు చేసిన ట్విట్‌పై స్పందించారు చిత్ర ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌. ‘సర్ థాంక్యూ సో మచ్.. మీకు ఈ సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద విషయం’ అంటూ బదులిచ్చాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైడ‌ర్ మూవీ ప్లాప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.అది మ‌న‌స్సులో పెట్టుకోకుండా మ‌హేశ్ బాబు ఇలా మురుగదాస్ సినిమా అభినందించ‌డం చాలా గొప్ప విష‌యం అని అంటున్నారు ఆయ‌న అభిమానులు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -