Monday, April 29, 2024
- Advertisement -

కూతురి దర్శకత్వం లో రజిని తో పాటు కమల్

- Advertisement -

తమిళ నాట రజనీకాంత్, కమల్ హాసన్ పెద్ద హీరోలు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలని ఆశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఈ పుకార్ల నడుమ కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ చేసిన కామెంట్స్ కొంత ఆసక్తి ని తీసుకొని వస్తున్నాయి. ఎప్పటికైనా దర్శకురాలు కావాలనేది అక్షర కల. అందుకే తన మనసులో ని మాట ని ఇప్పుడు బయట పెట్టింది. “నేను మా నాన్న ని డైరెక్ట్ చేస్తానో లేదో నాకు తెలియదు.

కానీ ఏదైనా ఒక రోజు అలంటి అవకాశమే వస్తే, తప్పకుండా ఆయనని ప్రధాన పాత్ర లో పెట్టి ఒక సూపర్ హీరో తరహా చిత్రాన్ని చేస్తాను. ఆయన దాదాపుగా అన్ని కాటగిరీల లో సినిమాలు చేశారు, కాకపోతే సూపర్ హీరో గా మాత్రం అయన నటించలేదు. నేను ఆ కోరిక ని తీర్చుకుంటాను. అలాగే నాన్న ని రజనీ సర్ ని పెట్టి కూడా ఒక సినిమా కి దర్శకత్వం చేయాలనే కోరిక కూడా ఉంది నాకు.” అని చెప్పింది అక్షర.

ప్రస్తుతం అక్షర హాసన్ నటిస్తున్న చిత్రం మిస్టర్ కేకే. విక్రమ్ ఈ సినిమా లో హీరో. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=y2qw1OiaZ8w

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -