Tuesday, May 14, 2024
- Advertisement -

రాష్ట్ర ఆర్థిక స్తితి గ‌తుల‌పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌నున్న వైసీపీ ప్ర‌భుత్వం…

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రావ‌డంతో బాబు న‌వ్యాంధ్ర సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఐదేళ్లు పాల‌న కాలంలో వేల కోట్ల రూపాయ‌ల‌ను దుబారాగా ఖ‌ర్చుపెట్టార‌నె ఆరోప‌న‌లు బ‌లంగా వినిపించాయి. నాఇష్టం అన్న రీతిలో పాల‌న సాగించారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ అధికారంలోకి వ‌చ్చింది….అధికారంలో ఉన్న టీడీపీ ప్ర‌తిప‌క్షంగా మారిపోయింది.

ఇద‌లా ఉంటె ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది . బాబు హ‌యాంలో చేసిన అవినీతి, అక్ర‌మాలు ,బ‌ట్ట‌బ‌య‌లు కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ బుధవారం విడుదల చేయనున్నారు. దీని ద్వారా బాబు పాల‌న‌లో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు బ‌ట్ట‌బ‌య‌లు కానున్నాయి.

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో బీఏసీ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. బడ్జెట్‌ సమావేశాలు 14 రోజులపాటు నిర్వ‌హించాల‌ని బీఏసీ స‌మావేశంలో నిర్ణ‌యించారు. రేపటి నుంచి ప్రారంభంకానున్న సమావేశాలు సెలవులతో కలిసి ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 12వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్ట‌నున్నారు.

బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు, భద్రతా తదితర విషయాలపై సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ఇతర శాఖల కార్యదర్శులతో స్పీకర్‌ చర్చించారు. బ‌డ్జెట్ స‌మావేశాల్లోనె రాష్ట్ర అర్థిక స్థితి గ‌తులు ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం భావించింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఖర్చులు, నిధుల దుర్వినియోగం, ఇతరత్రా అంశాలను సైతం వివరంగా తెలియజేసేందుకు శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విడుదల చేస్తున్నారని సమాచారం. దీని ద్వారా బాబు హ‌యాంలో చోటు చేసుకున్న సంచ‌ల‌నాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -