Thursday, April 25, 2024
- Advertisement -

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటీవ్!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కి కరోనా పాజిటీవ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్ తనకు కరోనా సోకినట్లు చెప్పడం జరిగింది.

ఈ రోజు ఉదయం కరోనా టెస్ట్స్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను క్వారంటైన్ లో ఉన్నాను.. చికిత్స పొందుతున్నాను. ఈమధ్య కాలంలో నన్ను కలిసి ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్స్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ అక్షయ్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్ స్టార్స్ సెకండ్ వేవ్ లో వరుసగా కరోనా బారినపడడం ఆందోళన కలిగిస్తుంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమీర్ ఖాన్, సచిన్ వంటి ప్రముఖులకు రోజుల వ్యవధిలో కరోనా సోకింది. మహారాష్ట్రల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -