Thursday, April 25, 2024
- Advertisement -

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

- Advertisement -

దేశంలో క‌రోనా వైర‌స్ (కోవిడ్-19) విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. ఈ ఏడాదిలోనే రోజువారీ అత్య‌ధిక క‌రోనా కేసులు గ‌త 24 గంట‌ల్లో న‌మోద‌య్యాయి. రోజువారీ క‌రోనా మ‌ర‌ణాలు సైతం 500 దాటాయి. ఈ స్థాయిలో క‌రోనా కొత్త కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌డ‌చిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 93,249 మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. 514 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ కేసులు, మ‌ర‌ణాల్లో ఈ ఏడాదిలో న‌మోదైన అత్య‌ధిక కేసులు ఇవే. దీంతో దేశంలో మొత్తం క‌రోనా పాజిటివ‌ట్ కేసులు 1,24,85,509కి, మొత్తం వైర‌స్ మార‌ణాలు 1,64,623 కు పెరిగాయి.

ఇక రోజువారీ కేసులు అత్య‌‌ధికంగా మ‌హారాష్ట్ర, హ‌ర్యానా, బెంగాల్‌, రాజ‌స్థాన్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ, జార్ఖండ్‌, బీహార్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, చంఢీగ‌ఢ్‌, గుజ‌రాత్ రాష్ట్రాల్లో న‌మోద‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంతోనే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై మ‌రింత క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే క‌రోనా కేసులు విష‌యంలో ప్ర‌పంచంలోనే భార‌త్ టాప్ లోకి చేరుతుంద‌నీ.. వైర‌స్ క‌ట్టడికి మ‌రిన్ని మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

ఘోర ప్ర‌మాదం.. 55 మంది దుర్మ‌ర‌ణం

రాత్రి నిద్రపోయే టైంలో ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

సమ్మర్ స్పెషల్: సోంపు గింజల కూల్ డ్రింక్.. ప్రయోజనాలెన్నో !

కరోనా కల్లోలం.. మూడో సారి లాక్‌డౌన్.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -