Monday, April 29, 2024
- Advertisement -

జయప్రదకు షాకిచ్చిన హైకోర్టు..

- Advertisement -

సినీనటి జయప్రదకు షాక్ తగిలింది. యూపీలోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ని జారీ చేయగా దీనిని నిలిపివేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిపై విచారణ చేపట్టిన అలహబాద్ హైకోర్టు జయప్రదకు షాకిచ్చింది. మార్చి 6లోపు జయప్రదని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

2019లో బీజేపీ తరపున రాంపూర్‌ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు జయప్రద. ఎన్నికల కోడ్ ఉండగా రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కేసు విచారణలో ఉండగా ఎన్ని సార్లు నోటీసులు పంపించినా పట్టించుకోలేదు. దీంతో జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ చేసింది న్యాయస్థానం.

అయితే దీనిని సవాల్ చేస్తూ జయప్రద పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలోనే మరో పిటిషన్‌ ని దాఖలు చేస్తామని జయప్రద తరపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ తో ‘లవ్@65’ మూవీలో నటిస్తోంది జయప్రద.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -