Sunday, May 11, 2025
- Advertisement -

ఆల్ ది బెస్ట్ అన్నా జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపిన త‌మిళ్ హీరో సూర్య‌…

- Advertisement -

ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు, 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్, చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు, ప్రముఖ తమిళ నటుడు సూర్య నుంచి అనూహ్య మద్దతు లభించింది. “ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన, ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టారు” అని ఆయన వ్యాఖ్యానించాడు.

తాను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పిన ఆయన, తాననుకున్నది సాధించే క్రమంలో కష్టపడేతత్వం వైఎస్‌ జగన్‌ కు ఉందని అన్నారు. తాను, జగన్ కలుసుకొన్న వేళ, రాజకీయ అంశాలు పెద్దగా చర్చకు రావని, అదే సమయంలో ప్రజలకు సేవ చేయాలన్న తపన ఆయనలో కనిపిస్తుందని అన్నారు.

మహానేత రాజశేఖరరెడ్డిని కోల్పోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పారు. జగన్ చేస్తున్న పాదయాత్ర కూడా, అతని తండ్రి చేసిన పాదయాత్రంత విజయవంతం కావాలని కోరుకుంటున్నానని అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -