Monday, April 29, 2024
- Advertisement -

బన్నీ సాహసోపేతమైన నిర్ణయం

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో త్వరలో రానున్న ఈ చిత్రానికి ఇంకా పేరు ని ఖరారు చేయలేదు. అయితే అది పక్కన పెడితే ఈ సినిమా అవ్వగానే, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే కొత్త సినిమా మొదలు పెడతాడు ఈ హీరో. ఈ సినిమా కథ పూర్తి గా కొత్త గా, వైవిధ్యం గా ఉండబోతుంది అనే టాక్ నడుస్తుంది. అయితే మొదటి నుండి వినూత్న కథల కోసం తాపత్రయ పడుతూ వచ్చిన బన్నీ కి ఈ సినిమా కూడా కొత్త గా ఉండబోతుంది అనగానే ఒప్పేసుకున్నాడు.

అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా లో బన్నీ రెండు మూడు విభిన్న పాత్రలలో దర్శనమివ్వనున్నాడు. అందుకోసం బన్నీ మిడిల్ ఏజ్ పాత్ర లో కనిపించాలట. వేషం, ఆహార్యం, మొత్తం మార్చేసి ఒక 45 పైబడిన మనిషి గా బన్నీ కనిపించనున్నాడట. అయితే ఇది సాహసం అని చెప్పాలి. స్టైలిష్ గా బన్నీ ని చూడాలి అనుకొనే అభిమానులు మరి బన్నీ ని మిడిల్ ఏజ్ గెటప్ లో అంగీకరిస్తారా లేదా అనేది తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -