Sunday, May 5, 2024
- Advertisement -

మనం దర్శకుడి తో విజయ్ దేవరకొండ?

- Advertisement -

దేవరకొండ విజయ్,. ప్రస్తుతం తెలుగు లో మంచి జోరు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరో ఇతడు. చాలా మంది యువ,సీనియర్ దర్శకులు అందరూ విజయ్ తో ఎప్పుడెప్పుడు సినిమాలు చేయాలా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పైన డియర్ కామ్రేడ్ అనే సినిమా ని చేసాడు. ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. అయితే ఇదే బ్యానర్ లో ఇంకొక సినిమా కూడా సైన్ చేసి అడ్వాన్స్ తీసుకున్నాడు విజయ్. అయితే నిర్మాతలు మాత్రం ఇంకా డైరెక్టర్ ని వెతకలేదు.

ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం మైత్రి బ్యానర్ లోనే నాని తో సినిమా చేస్తున్న విక్రమ్ కుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా చేయించాలి అని అనుకుంటున్నారు నిర్మాతలు. విజయ్ ప్రస్తుతం చాలా బిజీ గా ఉన్నాడు. తన డేట్స్ కూడా ఖాళీలేవు. మరో వైపు విక్రమ్ కుమార్ కూడా నాని తో సినిమా షూటింగ్ తో తీరిక లేకుండా ఉన్నాడు. కథ రెడీ చేసుకొని, స్క్రిప్ట్ రాసుకొని, షూటింగ్ కి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతోంది అన్న గ్యారెంటీ అయితే లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -