ప్రస్తుతం టాలీవుడ్లో అందరి దృష్టి దర్శకుడు సురేందర్రెడ్డి పైనే ఉంది. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించటం. ఈ సినిమా అక్టోబర్ 2న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా తరువాత సురేందర్రెడ్డి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఎవరితో చేయబోతున్నాడు? అనేది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం సురేందర్రెడ్డి కి సూపర్ స్టార్ మహేష్ బాబు లేదా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలని ఉందట. కానీ ఇద్దరు హీరోలు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఒకవైపు మహేష్ బాబు చేతిలో మరో రెండు సినిమాలు ఉండగా ఇటు అల్లు అర్జున్ ది కూడా అదే పరిస్థితి. ‘సైరా’ సినిమా హిట్ అయితే ఇద్దరూ సురేందర్ రెడ్డి తో సినిమా చేయడానికి తమ లైన్ నుంచి ఎవరో ఒక దర్శకుడి సినిమాని మరింత ఆలస్యం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇద్దరు హీరోల్లో ఎవరు సురేందర్ రెడ్డి తో సినిమా చేయాలని అనుకున్నా సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతుంది. అందుకే సుకుమార్ ముందు జాగ్రత్త తో బన్నీతో సినిమా లయంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో బన్నీ మరియు సుకుమార్ సినిమా ఓపెన్ అవుతోందని సమాచారం.
