- Advertisement -
ప్రభుఖ సినీనటి ప్రియారామ్ భాజాపా కండువా కప్పుకున్నారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. రోజాకు పోటీగా ప్రియారామన్‌ను భాజాపా తీసుకొచ్చిందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ప్రియారామన్ రోజాపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజా, తాను మంచి స్నేహితులమని, పోటీదారులం మాత్రం కాదని స్పష్టం చేశారు. జా సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రియా రామన్ ప్రకటించారు. ఏపీ రాజకీయాలపై తాను ఇప్పుడే చెప్పలేనని ప్రియా రామన్ స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం పని చేస్తానని తెలిపారు.
