Wednesday, May 22, 2024
- Advertisement -

‘అల్లు అర్జున్’ కనపడుట లేదు..!

- Advertisement -

అల్లు అర్జున్ మెగా అల్లుడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికి తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించాడు. ప్రస్తుతం ఉన్న మెగా హీరోలలో అల్లు అర్జున్ టాప్ ప్లేస్ లో ఉన్నాడంటే మనోడి క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు ఆయన బర్త్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. మరి అలాంటి అభిమానులకు మరో శుభావార్త చెప్పాడు బన్ని.

తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు బన్ని. దిల్ రాజు నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ కొత్త సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఐకాన్ పేరుతో అదే బ్యానర్ లో మరో సినిమా రాబోతుంది. కనపడుట లేదు క్యాప్షన్ గా హై లైట్ చేశారు. లుక్ లాంటిది ఏమి లేకుండా కేవలం టైటిల్ లోగోని మాత్రమే కట్ చేసి ఆసక్తి రేపే ప్రయత్నం చేశారు. బైక్ మీద హీరో ఎక్కడికో వెళ్తున్నట్టు దూర సంచారానికి దేని కోసమో వెతికేందుకు వెళ్తున్నట్టు దాని థీమ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేశారు. వేణు శ్రీరామ్ గతంలో దిల్ రాజు బ్యానర్ లోనే ఓమై ఫ్రెండ్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. ఆ సినిమా తరువాత వేణు ఇప్పటివరకు మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. అయితే తన దగ్గర ఉన్న కథతో బన్నిని ఒప్పించడమే కాదు, ఏకంగా దిల్ రాజుతో సినిమా గురించి బన్ని బర్త్ డే నాడే అనౌన్స్ చేయించాడు. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇక బన్ని విషయానికి వస్తే ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డె నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -