హీరో, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలయ్య మరో వివాదంలో ఇరుకున్నాడు. బాలయ్య తన ప్రవర్తనతో తీవ్ర విమర్శల పాలవుతువుతున్నాడు. గతంలో చాలాసార్లు అభిమానులపై చేయి చేసుకున్నాడు బాలయ్య. ఫోటోలు దిగడానికి దగ్గరికి వచ్చిన అభిమానులపై బాలయ్య చాలాసార్లు దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అప్పుడు ఈ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో ప్రత్యర్థులు బాలయ్య తీరును ఎండగడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓ జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడం సంచలనంగా మారింది.
అయితే ఈ ఇష్యూ పెద్దది కావడంతో ఈ సంఘటనపై బాలయ్య సారీ చెబుతు పత్రిక ప్రకటన నోట్ ను విడుదల చేశారు. ఈ ఘటన మరువక ముందే ప్రచారంలో ఓ అభిమాని వేల మెజార్టీ అన్నందుకు పచ్చి బూతులు తిట్టాడు బాలయ్య. తాజాగా మరోసారి బాలయ్య రెచ్చిపోయాడు. ఏమైందో తెలియదు కాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రోడ్డు మీద పరిగెత్తిచ్చి మరి కాలుతో తన్నాడు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అందరు షాక్ కు గురైయ్యారు. బాలయ్య ఇలా తన కోపాన్ని కార్యకర్తలపై చూపించడంపై సొంత పార్టీ వాళ్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే బాలయ్య హిందుపురంలో గెలవడం కష్టమని సొంత పార్టీ వాళ్లే చర్చించుకోవడం విశేషం.
- Advertisement -
పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బాలయ్య
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -
