Wednesday, April 24, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కి 735 రూపాయల జరిమానా

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంతో ముచ్చటగా చేయించుకున్న కారవాన్ పై తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల కన్ను పడింది. అంతే కాకుండా దాని మీద ఫైన్ కూడా వేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీ లో అంతా ఇదే చర్చ జరుగుతుంది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అల్లు అర్జున్ తన వాహనం గురించి చెప్పినప్పుడు ఎంత క్రేజ్ వచ్చి పడిందో ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉంది.

అయితే ఈ వాహనానికి ఉన్న అద్దాలకి బ్లాక్ ఫిలిం వేసి లోపల ఏం జరుగుతుంది అనేది తెలియనివ్వకపోవడం పై ట్రాఫిక్ పోలీసులకి ఫిర్యాదు అందింది. జులై 16 న ఈ వాహనం హిమాయత్ నగర్ వైపు వెళ్తుండగా కొంత మంది ఫోటో తీసి పోలీసులకి సమాచారం అందించారు. అయితే నిబంధనల ప్రకారం ఇలా బ్లాక్ కలర్ ఫిలిం ని అంటించడం విరుద్ధం. అందుకే సుప్రీమ్ కోర్టు బాన్ చేసింది అని తెలిసి కూడా ఇంకా కొంత మంది దానిని ఉపయోగిస్తున్నారు.

అందుకే వెంటనే పోలీసులు రెస్పాండ్ అయ్యి 735 రూపాయల చలాన్ ని ఇష్యూ చేశారు. అయితే ఇది జరిగి చాలా రోజులు అవుతున్నా విషయం మాత్రం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -