Tuesday, May 7, 2024
- Advertisement -

పిచ్చెక్కిస్తున్న సాహో కొత్త పోస్టర్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు శ్రద్ధ కపూర్ ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమా కి దర్శకుడు సుజీత్. ఎప్పుడో మొదలయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమా మీద ఎవ్వరికీ లేని అంచనాలు ప్రభాస్ అభిమానుల కు మాత్రమే ఉన్నాయి. అయితే ముందు ఈ సినిమా కి నెగటివ్ బజ్ ఉన్నప్పటికీ క్రమక్రమం గా చిత్ర యూనిట్ దానిని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేసిన టీమ్ సినిమా మీద అమాంతం బజ్ పెంచేశారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తి అందరిలో ఉంది, అయితే ప్లాన్ ప్రకారం ఆగస్టు 15 న సినిమా విడుదల కావాలి కానీ అనూహ్యం గా సినిమా వెనక్కి వెళ్లిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. సో ప్రమోషన్స్ లో కూడా జోరు పెరిగింది.

ఈ రోజు విడుదల అయిన పోస్టర్ లో ప్రభాస్, మరియు శ్రద్ధ కలిసి ఉన్నారు. ఇద్దరూ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొనే సందర్భం గా తీసిన స్టైల్ లాగా ఉంది. చేతిలో గన్స్ తో సాలిడ్ గా యాక్షన్ లో ఉన్న ఈ ఇద్దరూ సినిమా లో ఇంకెంత యాక్షన్ చూపించి ఆకట్టుకుంటారో అనే అభిప్రాయం మనకి కలగా మానదు. ఇద్దరూ స్టైలిష్ గా కూడా పోస్టర్ మీద కనిపిస్తున్నారు. త్వరలో నే సాహో సినిమా కి సంబంధించి రెండో సాంగ్ బయటకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -