జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు, అల్లు అర్జున్‌కు ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే.‘చెప్పను బ్రదర్’ అంటు బన్నీ చేసిన కామెంట్‌కు పవన్ కల్యాణ్ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బన్నీని పవన్ అభిమానలు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అయితే శ్రీరెడ్డి ఉదంతం అనంతరం బన్నీ పవన్‌కు సపోర్ట్‌గా నిలవడంతో ఈ ఇద్దరి మధ్య దూరం తగ్గింది. బన్నీ ‘నా పేరు సూర్య’ మూవీ సక్సెస్‌మీట్‌కు పవన్ ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది.
ఇప్పుడు తాజాగా బన్నీ పవన్ రాజకీయలపై స్పందించాడు.ద్వారా వ్యక్త పరిచారు. ‘నువు నీ పిచ్చితో ఉంటే… ప్రపంచమే సర్దుకుపోతుంది’ అంటూ పవన్ ఫోటోను షేర్ చేశారు. ఇంత మంది మెగా హీరోలు ఉన్నా కూడా ఒంటరిగానే నిలబడ్డారు పవన్ కల్యాణ్. ఏ ఒక్కరి సహాయాన్ని పవన్ కోరడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా మెగా హీరోలే స్పందించి మేము ఎప్పుడైనా పవన్ వెంట నడవడానికి సిద్ధమే అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే పవన్ మాత్రం మెగా హీరోలను తన పార్టీలోకి తీసుకోకూడదని అనుకుంటున్నట్లు సమాచారం.
