Wednesday, May 1, 2024
- Advertisement -

పార్టీ మార్పుపై గల్లా షాకింగ్ కామెంట్స్…. ఆ సీట్లు ఇస్తేనే…….?

- Advertisement -

అంతే మరి……..వ్యాపారస్థులతో వ్యవహారం అలానే ఉంటుంది. అది కూడా పార్టీ గెలుస్తుందో లేదో అన్న అనుమానం వచ్చినప్పుడు పార్టీని వీడతాం అని డైరెక్ట్‌గా అధినేతనే హెచ్చరించగలరు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా అదే చేస్తున్నాడు. 2014 ఎన్నికల్లో చాలా స్థానాల్లో టిడిపి గెలుపుకు స్పాన్సర్ చేసిన బడా బిజినెస్ మేన్ ఈ గల్లా జయదేవ్. అఫ్కోర్స్ ఎంపిగా గెలిచాక ప్రజల కోసం ఏం చేశారయ్యా అంటే సమాధానం ఉండదు. కానీ పార్లమెంట్‌లో ఒక్కసారి ‘మిస్టర్ మోడీ’ అని గట్టిగా మాట్లాడినందుకు స్పాన్సర్డ్ సన్మానాలు చేయించుకున్న ఘనత ఈ గల్లా జయదేవ్‌ది.

ఇప్పుడు ఈ ఎంపిగారు 2019 ఎన్నికల వ్యూహాన్ని రచించుకున్నారు. అసలే గల్లా కుటుంబానిది దశాబ్ధాల రాజకీయం. అందుకే ఇప్పుడు గల్లా జయదేవ్‌తో పాటు ఆయన తల్లి గల్లా అరుణకుమారి కూడా సీట్ల విషయంలో చంద్రబాబు దగ్గర సరికొత్త డిమాండ్స్ పెట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో టిడిపి గెలిచే అవకాశమే లేదు అని బాబు సొంత సర్వేలు కూడా తేల్చేసిన నేపథ్యంలో 2019 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని చెప్పేశారు గల్లా అరుణకుమారి. ఇప్పుడు తనయుడు గల్లా జయదేవ్ కూడా డైరెక్ట్‌గానే ఆ విషయంపై స్పందించాడు. అది కూడా టిడిపి భజన పత్రిక ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం నుంచి తన తల్లి పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. వేరే నియోజకవర్గంలో సీటు ఇవ్వాల్సిందేనన్నట్టుగా చంద్రబాబుకు హెచ్చరికలు పంపాడు. ఇంతకుముందు కూడా బాబుతో వ్యక్తిగత మీటింగ్స్‌లో తన తల్లికి చంద్రగిరి నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తేనే ఇద్దరమూ కూడా పార్టీలో ఉంటామని, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పాడట గల్లా జయదేవ్. ఆర్థికంగా అత్యంత బలవంతుడైన గల్లా జయదేవ్‌ని వదులుకునే పరిస్థితిలో లేడు చంద్రబాబు. అయినప్పటికీ వ్యవహారాన్ని నానుస్తూ ఉండడంతో ఇప్పుడు డైరెక్ట్‌గా పచ్చ మీడియా ద్వారానే చంద్రబాబుకు బహిరంగంగా హెచ్చరికలు పంపాడు. ముందు ముందు గల్లా వారి అడుగులు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గణంగా కనిపిస్తోంది. అసలే అఖిలప్రియ నుంచి ఎంతో మంది నేతల టికెట్స్ వ్యవహారంతో తల బొప్పి కట్టి ఉన్న బాబుకు తాజాగా గల్లా హెచ్చరికలు షాక్‌కి గురిచేసి ఉంటాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -