Thursday, May 2, 2024
- Advertisement -

అల్లు అర్హ వర్సెస్ ఘట్టమనేని సితార

- Advertisement -

అల్లు అర్జున్ ఫస్ట్ కిడ్ అయాన్ కు తాను ఎంతలా పాపులారిటీ తెచ్చాడో అదే మాదిరిగా… ముద్దుల కూతురుకు తన వైఫ్ నుంచి పాపులారిటీ తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. దానిలో భాగంగా సోషల్ మీడియాలో స్నేహారెడ్డి తన గారాల పట్టిని మోకాళ్ళపై ఎత్తుకుని కనిపించగా.. అర్హ కెమెరాను చూస్తూ చిరునవ్వులు చిందించింది. ఈ ఫోటోను చూసిన గంటలోగానే 45 వేలకుపైగా రియాక్షన్స్ వచ్చాయి. బన్నీ బాబు అభిమానులు ఈ పిక్ ను తన గ్రూపుల్లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

బహుశ సౌత్ సినీ పరిశ్రమలో తమ పిల్లలను సోషల్ మీడియా స్టార్లుగా మార్చుతోన్న వారిలో బన్నీ మొదటి వరుసలో ఉంటే రెండో వరుసలో …మహేష్ తన కూతురు మ్యాటర్లో ఉన్నాడని పిస్తుంది. కాకపోతే బన్నీ అండ్ స్నేహరెడ్డి మాదిరిగా సోలో ప్రమోషన్ చేయకుండానే…అనుకోకుండా ఫ్యాన్స్ చేస్తోన్న ప్రమోషన్ తోనే ప్రిన్స్ కూతురు సితార క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంకో ఏడాది పోతే సితార మాదిరిగానే అల్లు అర్హ కూడా మరింత క్యూట్ గా తయారవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. చివరకు పోటీ రానున్న రోజుల్లో ఘట్టమనేని సితార,అల్లు అర్హ మధ్యనే ఉండొచ్చని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -