Thursday, May 23, 2024
- Advertisement -

అల్లు అర్జున్ నా పేరు సూర్య ట్వీట్ట‌ర్ రివ్యూ

- Advertisement -

అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఈ రోజు (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచియ‌మ‌వుతున్నాడు. బ‌న్నీకి జంట‌గా అను ఇమ్మాన్యూయేల్ నటిస్తుంది.168 నిమిషాల న‌డివి గ‌ల ఈ సినిమా కథ సీన్ టూ సీన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

అభిమానుల ట్వీట్ట‌ర్ రివ్యూ
డెహ్రాడూన్ లోని ఆర్మీ క్యాంప్ లో అల్లు అర్జున్ చాలా సింపుల్ గా ఎంట్రీ.. బార్ లో ఫైట్ సన్నివేశం తో మొదలైంది సినిమా.హీరో ఎంట్రీతో పోలీస్ స్టేషన్‌లో యాక్షన్ సీన్.. అల్లు అర్జున్ క్యారెక్టర్.. ఫస్ట్ సాంగ్.. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, బన్నీ మధ్య‌ తీవ్ర స్థాయిలో మాటల యుద్దం… బన్నికి సస్పెండ్ చేస్తాడు బొమన్ ఇరానీ.బన్నీకి గాడ్ ఫాదర్ గా నటుడు రావు రమేష్ ఎంట్రీ… ఒక సైకాలజీ ప్రొఫెసర్, బన్నీ తండ్రి గా యాక్షన్ హీరో అర్జున్ ఎంట్రీ ఇస్తాడు.తీవ్ర కోపంతో ఉండే బ‌న్నీ అలా ఎందుకు మారాడు అనేది చూపిస్తారు.బ‌న్నీకి చిన్నతనంలోనే సమస్యలు వచ్చాయి.ఆ స‌మ్య‌స‌ల వ‌ల్ల అత‌ను ఇలా మారాతాడు అనేది స్ప‌ష్టం అవుతుంది.సినిమా ఇప్పుడు విశాఖ పట్నం షిఫ్ట్ అయ్యింది. అర్జున్ భార్యగా నదియా ప‌రిచియ‌మ‌వుతుంది. ఇక బన్ని రూమ్ మెట్ గా కమెడియన్ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు.

శరత్ కుమార్, ఠాకూర్ అనూప్ సింగ్ తండ్రీ కొడుకులుగా పరిచయం అయ్యారు. బన్ని, అర్జున్‌ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి.స‌డ‌న్‌గా సినిమా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లుతుంది.హీరోయిన్ అను ఇమ్మాన్యూయేల్ ఎంట్రీ ఇచ్చింది. ‘బ్యూటిఫుల్ లవ్’ సాంగ్ వస్తుంది. పోసాని కృష్ణ మురళి హీరోయిన్ అంకుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యింది. సినిమా మళ్లీ ప్రస్తుత రోజుల్లోకి మారింది.‘లవర్ ఆల్సో..ఫైటర్ ఆల్సో’ సాంగ్ వస్తుంది. అల్లు అర్జున్ అద్భుతమైన డ్యాన్..పిక్చరైజేషన్ సూపర్ గా ఉంది. ప్రస్తుతం బన్ని, అర్జున్ మద్య కొన్ని కౌన్సిలింగ్ సీన్లు వస్తున్నాయి..చిత్రం మరోసారి సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. బన్ని, అనూప్ సింగ్ ల మ‌ధ్య‌ భారీ ఫైట్ సన్నివేశం వస్తుంది. ఇంట్రవెల్ పడింది.

ఇంట్రవెల్ తర్వాత సినిమా మొదలైంది..యాంగర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. బన్నీ తన షార్ట్ టెంపర్, ఆవేశాన్ని కోల్పోకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బన్ని కుటుంబానికి బాగా దగ్గరవుతున్నాడు..కొన్ని ఎమెషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఓ మాజీ సైనికుడిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక సమస్యపై శరత్ కుమార్ తో పోరాటం చేస్తున్నాడు. చాలా కాలం కుటుంబాని దూరంగా ఉన్న బన్ని వారితో కలిసిపోతాడు..‘ఎన్నియల్లో’ సాంగ్ వస్తుంది. చిత్రంలో ఓ చిన్న ట్విస్ట్ రివీల్ అయ్యింది. బన్నీ తిరిగి తన హైపర్ లోకి వచ్చాడు..కొన్ని ఇంపార్టెంట్ సన్నివేశాలు వస్తున్నాయి. బన్నీ, అనూప్ కి మద్య మరో భారీ యాక్షన్ ఫైట్ సన్నివేశం వస్తుంది. ఇద్దరూ తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు..ప్రేక్షకులు ఉత్కంఠంతో చూస్తున్నారు చిత్రంలో చివరి పాట ‘ఇరగ ఇరగ..’ వస్తుంది..బన్నీ డ్యాన్స్ మరోసారి ఇరగదీశాడు. బన్ని, శరత్ కుమార్ కి మధ్య‌ కొన్ని తీవ్ర స్థాయిలో సన్నివేశాలు వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో క్లయిమాక్స్ డైలాగ్స్ అదిరిపోతున్నాయనే చెప్పొచ్చు..బన్ని హార్డ్ హిట్టింగ్ లాంగ్ డైలాగ్ చూస్తుంటే థియేటర్లో ప్రేక్షకులు ముగ్ధులైన పోతున్నారు. చిత్రంలో మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల తర్వాత దేశభక్తికి సంబంధించిన మెసేజ్ వస్తుంది. సినిమా హ్యాపీ ఎండింగ్ తో పూర్తయ్యింది.సినిమాలో చాలా ల్యాగ్ సీన్స్ ఉండటంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

సినిమా పూర్తి రివ్వ్యూ కోసం చూస్తునే ఉండండి ఆద్యా న్యూస్‌

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -