Sunday, May 5, 2024
- Advertisement -

పంతం పట్టినట్టుగా టిడిపి, బిజెపి నాయకులను వైకాపాలో చేరుస్తున్న కాటసాని

- Advertisement -

కన్నా లక్ష్మీనారాయణ వైకాపా కండువాను కప్పుకోకుండా విజయవంతంగా అడ్డుకోగలిగారు టిడిపి నాయకులు. ఎలా అయినా కన్నాను టిడిపిలో చేర్చుకోవాలని బంపర్ ఆఫర్స్ఇస్తున్నారు. అయినప్పటికీ కన్నా మాత్రం చంద్రబాబును ఇంకా పూర్తిగా నమ్మడం లేదు. మరోవైపు జగన్‌కి అమిత్ షా కాల్ చేయడంతోనే కన్నా చేరిక ఆగిపోయిందని కూడా పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తోంది. అయితే ఆ ఆరోపణలు అన్నీ అసత్యాలని బిజెపి నుంచి వైకాపాలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి నిరూపిస్తున్నారు.

2014 ఎన్నికల్లో కన్నా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రజాదరణ పొందాడు కాటసాని. వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయినప్పటికీ పోటీపడిన టిడిపి అభ్యర్థిని ఏకంగా మూడో స్థానానికి పంపిన చరిత్ర కాటసాని రాంభూపాల్ రెడ్డిది. అధికారంలోకి వచ్చిన పార్టీ ఒక నియోజకవర్గంలో మూడో స్థానానికి పరిమితం కావడం అంటే ఎంత ఘోర అవమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కాటసాని బిజెపిని వీడి ఇప్పుడు వైకాపాలో చేరాడు. నామ్ కే వాస్తే చేరడమే కాదు కర్నూలు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి సెకండ్ గ్రేడ్ నాయకులను ఖాళీ చేయిస్తున్నాడు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, వివిధ కార్పొరేషన్స్‌కి అధ్యక్షులుగా, ఛైర్యన్లుగా చేసిన నాయకులను వైకాపాలో చేరేలా ప్రోత్సహిస్తున్నాడు కాటసాని. జగన్ తరపున పూర్తిగా వకాల్తా పుచ్చుకున్న కాటసాని…….2019లో అధికారంలోకి వచ్చేది జగనేనని….అందుకే అందరం జగన్‌కే మద్దతిద్దామని…..నాయకుల భవిష్యత్ బాగుండేలా జగన్‌కి చెప్పి నేను చూసుకుంటానని భరోసా ఇస్తున్నాడు కాటసాని. సాధారణంగా పార్టీల్లో ఉన్న నాయకుల్లో చాలా మంది ఎన్నికల వరకూ కూడా నామ్ కే వాస్తే అన్నట్టుగా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ కాటసాని మాత్రం పార్టీలో చేరిన మరుక్షణం నుంచీ కూడా టిడిపి, బిజెపి నాయకులను వైకాపాలో చేరుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ఉండడం వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం పెంచుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -