Wednesday, May 1, 2024
- Advertisement -

క్రేజీ అప్‌డేట్…పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూసే. పుష్ప 2 రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు.2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

ఇక శరవేగంగా పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుగగా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వేర్ ఇస్ పుష్ప వీడియో సినిమాపై మరింత అంచనాలు పెంచింది.

2021 విడుదలైన పుష్ప బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోగా ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -