Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీకి దూరమవుతున్న మిత్రపక్షాలు!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, జైలు పాలు కావడంతో ఒక్క సారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు టీడీపీతో జనసేన,బీజేపీ పొత్తు ఉంటుందని అంతా భావించిన అవినీతి కేసులో టీడీపీ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఇప్పుడు టీడీపీ,జనసే,బీజేపీ పొత్తు సందిగ్దంలో పడిపోయింది.

అయితే చంద్రబాబు అరెస్ట్‌ పై తొలుత స్పందించిన జనసేన,బీజేపీ నేతలు ఇప్పుడు క్రమంగా వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. టీడీపీకి మద్దతివ్వడం ద్వారా ప్రజల్లో తమ పరువు పోతుందని నేతలు భావిస్తున్నారట. ఎందుకంటే తొలుత చంద్రబాబు అరెస్ట్‌తో ప్రజల్లో సింపతి వస్తుందని టీడీపీ నేతలు భావించారు. జనసేన,బీజేపీ నేతలు కూడా ఇదే అభిప్రాయంలో ఉండగా ప్రస్తుతం చూస్తే ఆ పరిస్థితి కనిపించకపోవడంతో వెనక్కితగ్గాలనే నిర్ణయించుకున్నారట ఆ పార్టీల నేతలు.

అటో ఇటో జనసేన నేతలు స్పందిస్తున్న బీజేపీ నేతలు మాత్రం అసలు టీడీపీతో సంబంధం లేదన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. అందుకే ఇవాళ టీడీపీ బంద్‌కు పిలుపునివ్వగా బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుందనే వార్తలు వచ్చినా ఆ పార్టీ నేతలు మాత్రం ఖండించారు. మొదటి నుంచి కూడా బీజేపీ.. టీడీపీతో దోస్తీ విషయంలో కొంత దూరం పాటిస్తూనే ఉంది. దీంతో ఇప్పటివరకు పొత్తుపై ఆశలు పెట్టుకున్న బాబుకు తాజా రాజకీయ పరిణాలు మింగుడు పడటం లేదు. ఏదిఏమైనా టీడీపీకి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తుందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -