- Advertisement -

‘రాకా’ బోల్డ్‌గా అల్లు అర్జున్..!

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. దర్శకుడు అట్లీతో కలిసి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ (AA22xA6)కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు.

ఈ భారీ యాక్షన్ చిత్రంకు “రాకా (Raaka)” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రపంచాలను దాటి వెళ్లే ఫిక్షన్గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం భయానకంగా, మిస్టీరియస్‌గా ఆకట్టుకుంటోంది.

పోస్టర్‌లో అల్లు అర్జున్ పూర్తిగా బోల్డ్ లుక్‌లో కనిపిస్తుండగా, ఆయన ముఖం ఒక వోల్ఫ్‌లాంటి చేతి ద్వారా కొంతమేర కప్పబడి ఉంది. ఈ కొత్త గెటప్ చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ పాత్రలో ఆయనకు సూపర్‌నేచురల్ లేదా ప్రిమిటివ్ టచ్ ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

“Prepare yourself for a vision beyond limits” అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా డార్క్ మరియు గ్రాండ్ టోన్‌ను సెట్ చేశారు.ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో, తెలుగు సహా మొత్తం 7 భారతీయ మరియు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో బెంగాలీ, అరబిక్ భాషలు కూడా ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా కీలక పాత్రలో నటించనుండటం ఈ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ మూవీని 2027 వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -