- Advertisement -

పైలెట్ ట్రైనింగ్‌కు వెళ్తే..ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం!

- Advertisement -

హైదరాబాద్‌లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. శిక్షణ పేరుతో యువతిపై ఓ ఇన్‌స్ట్రక్టర్‌ జనవరి 2025 నుంచి పలుమార్లు అత్యాచారం జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది.

పైలెట్ కావాలన్న ఆ యువతి కలలను చిదిమేస్తూ.. అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. బేగంపేట పైలెట్ ట్రైనింగ్ సెంటర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. బేగంపేటలోని ఏవికన్స్ పైలెట్ శిక్షణ సంస్థలో పైలెట్ కోర్సు నేర్చుకుంటోంది ఓ యువతి.

యువతిపై కన్నేశాడు అదే సంస్థలో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న కేరళంకు చెందిన నసిముద్దీన్. శిక్షణ పేరుతో లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ దారుణాలను ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడగా వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -