Monday, April 29, 2024
- Advertisement -

బన్నీ రికమెండేషన్ లిస్ట్ లో చేరిన హీరోయిన్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, నివేత పెత్తురాజ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సినిమా కి సంబందించిన సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్నాక అల్లు అర్జున్ ఐకాన్ అనే ఒక కొత్త చిత్రం ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడి గా వ్యవహరించనున్నారు.

ఇకపోతే ఈ సినిమా లో హీరోయిన్ల ని ఇంకా నిర్ణయించలేదు. దిల్ రాజు నిర్మించాలని అనుకుంటున్నా ఈ సినిమా కి ఎవరిని హీరోయిన్ గా తీసుకోవాలి అనే విషయం పై కూడా ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇప్పటికే అలియా భట్ ని ఈ సినిమా లో ప్రధాన హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ కి అల్లు అర్జున్ సూచన చేసాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నివేత పెత్తురాజ్ ని కూడా ఈ సినిమా లో రెండో హీరోయిన్ గా తీసుకోమని రికమెండ్ చేసాడట. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -