Sunday, May 5, 2024
- Advertisement -

‘టాక్సీవాలా’ ద‌ర్శ‌కుడికి సారీ చెప్పిన అల్లు అర్జున్‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టించిన చిత్రం టాక్సీవాలా.గ‌త వారం విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. విడుద‌ల‌కు ముందే సినిమా ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో సినిమాపై ఆశ‌లు వ‌దుల‌కున్నారు.కాని సినిమాలో కంటెంట్ ఉండ‌టంతో సినిమా విజ‌యం సాధించింది.తాజాగా ఈ సినిమా యూనిట్‌కు ఓ ప‌బ్‌లో పార్టీ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.ఆ స‌మ‌యంలో చిత్ర ద‌ర్శ‌కుడిని ప‌క్క‌కు తీసుకువెళ్లి మ‌రి క్ష‌మ‌ప‌ణ‌లు చెప్పాడట అల్లు అర్జున్‌.

నాకు ఎందుకు సారీ చెబుతున్నారు అని బ‌న్నిని ద‌ర్శ‌కుడు అడ‌గ్గా.. టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మీ గురించి మాట్లాడ‌నందుకు సారీ చెప్పార‌ట బ‌న్ని.నేను పెద్ద‌గా తెలియ‌దు క‌దా సార్ అని అన్న‌డ‌ట‌ ద‌ర్శ‌కుడు.తెలిసినా తెలియకపోయినా .. చూసినా చూడకపోయినా స్టేజ్ పై నేను మీ గురించి మాట్లాడాలి .. ఎందుకంటే డైరెక్టర్ అనేది గౌరవప్రదమైన పొజీషన్. అలాంటి మీ గురించి స్టేజ్ పై మాట్లాడటం మరిచిపోయాను .. ఐయామ్ వెరీ సారీ’ అన్నారు. బన్నీ అలా మాట్లాడటం ఆయన గొప్పతనం అని చెప్పుకొచ్చాడు టాక్సీవాలా ద‌ర్శ‌కుడు రాహుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -