Saturday, May 10, 2025
- Advertisement -

ఆ రెండు తర్వాత హ్యాంగ్ అయ్యేది అక్కడే.. అల్లు శిరీష్!

- Advertisement -

మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్, టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వారసునిగా, బన్నీ తమ్ముడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శిరీష్ తెలుగులో “గౌరవం” మూవీ ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. తరువాత వచ్చిన ABCD, ‘క్షణం’ మూవీస్ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచాయి.మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా వరస సినిమాలతో దూసుకుపోతుంటే అల్లు శిరీష్‌కు మాత్రం ఇంకా ఆ స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి.

అల్లు శిరీష్‌ సోషల్ మీడియాలో పంచ్‌లు వేస్తూ సరదాగా తన మీద వచ్చే ట్రోలింగ్‌ పై అల్లు శిరీష్ సెటైర్లు వేస్తుంటారు. తనకి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. అయితే అల్లు శిరీష్ ఇప్పుడు ఫుల్ హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తోంది. మామూలుగా ఈ హీరోకి కాఫీ షాప్, బుక్ షాప్స్ అంటే మహా ఇష్టం. అవి రెండూ కాకుండా ఇంటిలోని గార్డెన్ ఏరియాలో అల్లు శిరీష్ హ్యాంగ్ అవుతాడట. ఈ విషయాన్ని తాజాగా శిరీష్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.అదే విధంగా తన ఫ్యామిలీలో కొందరికీ కరోనా పాజిటివ్ రావడంతో తాను పరీక్షలు చేయించుకున్నానని,నెగెటివ్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు.అభిమానులకు కరోనా నియమాలు పాటించాలని కోరారు.

Also read:బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

అల్లు శిరీష్‌ తొలిసారి బాలీవుడ్‌లో నటించిన ‘విలయాటి షరాబి’ మ్యూజిక్‌ ఆల్భమ్‌ 100 మిలియన్‌ క్లబ్‌లోకి చేరిపోయింది. గతనెల చివర్లో యూట్యూబ్‌లో విడుదలైన ఈ స్పెషల్‌ వీడియో సాంగ్‌ సోషల్ మీడియాను షేక్‌ చేసింది. ప్రస్తుతం అల్లు శిరీష్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నట్టు సమాచారం.

Also read:ఎన్టీఆర్ రండి గెలుద్దాం అంటూ వెనకడుగు.. నిరాశలో అభిమానులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -