Friday, May 3, 2024
- Advertisement -

బన్నీ కథలో ఎన్టీఆర్.. మరోసారి స్టూడెంట్ పాత్రలో!

- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన “జనతాగ్యారేజ్”ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కు ఇంతటి విజయాన్ని అందించిన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని అభిమానులు భావించారు. అయితే ఇదే సమయంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కొన్ని కారణాలవల్ల ఆగిపోవడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది.

వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ పాత్రలో కనిపించనున్నారు. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో స్టూడెంట్ పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తూ, స్టూడెంట్స్ పాలిటిక్స్ కథాంశంతోనే తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

Also read:మంచు విష్ణు కుటుంబంలో చిచ్చు.. ఐపీఎల్ వల్లే అంటూ ట్వీట్!

తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నిజానికి అల్లు అర్జున్ కోసం తయారు చేసినది. బన్నీ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలుస్తోంది. యువసుధ క్రియేషన్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తుండగా 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. కొరటాల శివ బన్నీ కథతో ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తూ ఉండటంతో విశేషం. అయితే బన్నీ కొరటాల శివ కాంబినేషన్లో సినిమా ఉంటుందా? లేదా?అనేది ప్రశ్నార్ధకంగా మిగిలింది.

Also read:కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -