Monday, April 29, 2024
- Advertisement -

అల్లు శిరీష్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అల్లు శిరీష్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినా కెరీర్‌ని టర్న్ చేసే సరైన హిట్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ABCD మూవీ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. టార్గెట్ పెట్టుకున్నట్లుగానే ఈ సారి ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో తన ఆరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ చిత్రం రాబోతుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 మూవీస్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కొంత భాగం జరిగింది.

ఈ సినిమా నుంచి అల్లు శిరీష్, అనుల రొమాంటిక్ లుక్ ను నిర్మాత బన్నీ వాసు గురువారం విడుదల చేశారు. మే 30న అల్లు శిరీష్ పుట్టిన రోజు జరగనుంది. అల్లు శిరీష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఆ రోజే ఈ చిత్ర పూర్తి వివరాలు తెలియజేయనుంది టీమ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -