Friday, May 17, 2024
- Advertisement -

నిరుపేద చిన్నారులకు నాణ్యమైన విద్య : సీఎం జగన్

- Advertisement -

క‌రోనాపై పోరాటంలో భాగమైన సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్ అభినందించారు. కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్నాయని.. సానుకూల పరిస్థితి ఏర్పడుతోందని సీఎం చెప్పారు. ఏపిలో విద్యా వ్యవస్థపై మరోసారి తనదైన మార్క్ చాటుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. నేడు సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలన్నదే తన తపన అని స్పష్టం చేశారు.

ఏపీలో వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలు మార్చేస్తున్నామని, ఇప్పుడు వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లతో విద్యాప్రమాణాలను మరింత ఉన్నతీకరిస్తామని అన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. వైఎస్సార్ ప్రీప్రైమరీ, ఫౌండేషన్ స్కూళ్లు అన్నీ పిల్లలకు కిలోమీటరు దూరంలోనే ఉండాలని, అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరంలోనే ఉండాలని, ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గత ఏడాది నుంచి విద్యావ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఏపిలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించేందుకు చిన్ననాటి నుంచే విద్యార్థులకు చక్కటి బోధన అందించాలని అన్నారు.

బంపర్ ఆఫర్ కొట్టేసిన యాంకర్ రష్మి

జూనియర్‌ డాక్టర్ల చర్చలు సఫలం..

వరుణ్ తేజ్ ”గని” కోసం హాలీవుడ్ నుంచి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -