Thursday, April 25, 2024
- Advertisement -

ఫ్లాప్ దర్శకుడితో మెగా హీరో.

- Advertisement -

మెగా హీరో అల్లు శిరీష్ ఇటీవలే ABCD అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా మార్నింగ్ షో నుండి నెగెటివ్ రివ్యూస్ రావడం తో ఈ సినిమా గురించి ఎవరూ పెద్ద మాట్లాడుకున్న సందర్భం లేదు. నిర్మాతలు ఎలాగో డబ్బులు లాస్ అవుతారు అని ముందే ఊహించినట్టున్నారు, అందుకే ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయడం లేదు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ ఒక కొత్త సినిమా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

వివరాల లోకి వెళితే కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమా తో తెలుగు లో దర్శకుడిగా అడుగు పెట్టిన తమిళ ఫిలిమ్ మేకర్ ప్రస్తుతం ఒక కథ సిద్దం చేసినట్టుగా తెలిసింది. ఎప్పటినుంచో గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో తిరుగుతూ అల్లు అరవింద్ ని తన కథ తో మెప్పించే ప్రయత్నం చేస్తూ వచ్చిన ప్రేమ్ సాయి ఎట్టకేలకు తన కథ ను పూర్తి చేసి అటు అల్లు అరవింద్ ని ఇటు అల్లు శిరీష్ ని ఒప్పించినట్లు తెలుస్తుంది.

అయితే ఎప్పుడో ఈ సినిమా ని ప్రారంభిద్దాం అని అనుకుంటున్న వీరు ABCD రిలీజ్ కోసం ఇన్ని రోజులు వేచి చూశారు అని సమాచారం. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి ఒక అధికారిక ప్రకటన బయటకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -