అమ్మాయిని ప్రేమించి కొడుకు మోసం చేస్తే… క‌న్యాదానం చేసిన తండ్రి

- Advertisement -

కొడుకు ప్రేమ‌పేరుతో అమ్మాయిని మోసం చేశాడు. పెళ్ళి చేసుకుంటాన‌ని చెప్పి చివ‌ర‌కు స‌సేమీరా అని మోసం చేశాడు. అమ్మాయి త‌ల్లి దండ్రులు కూడా ప‌ట్టించేకోక‌పోవ‌డంతో ఆ అమ్మాయి జీవితం రోడ్డ‌న ప‌డింది. తన కుమారుడి వల్లే ఆమె జీవితం నాశనమైందని గ్రహించిన తండ్రి…సుపుత్రుడికి దిమ్మతిరిగే గుణపాఠం చెప్పాడు. కొడుకు మోసం చేసి వదిలేసిన యువతికి అతని తండ్రి అండగా నిలిచాడు. వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి తన యావదాస్తిని ఆ యువతి పేరిట రాసిచ్చి కొడుకుకి షాక్ ఇచ్చాడు.

వివ‌రాల్లోకి వెల్తే..కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా తిరునక్కారం గ్రామంలో నివసిస్తున్న షాజీ కొడుకు ఆరేళ్ల కిందట ఓ యువతిని ప్రేమించాడు. ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఐతే అప్పడు వారిద్దరు మైనర్లు కావడంతో పెళ్లి ఆగిపోయింది. మేజర్లయ్యాక తానే పెళ్లి చేస్తానని షాజి వాగ్ధానం చేశాడు.

- Advertisement -

అయితే షాజీ కుమారుడికి ఈ మధ్య కాలంలో మరో యువతితో పరిచయం ఏర్పడింది. దీనిని అతని మొదటి ప్రియురాలు నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విషయం ఊరంతా తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో అమ్మాయి జీవితం రోడ్డున ప‌డింది.ఈ పరిణామాలన్నీ షాజిని తీవ్రగా బాధించాయి. తన కొడుకు వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనమవుతోందని మదనపడ్డాడు.

కొడుక్కు ఎలాగైనా బుద్ది చెప్పాల‌ని యువతినికి మంచి సంబంధం చూసి వేరొక అబ్బాయితో యువతికి పెళ్లిచేశాడు. తిరునక్కార మహాదేవ ఆలయంలో బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించాడు. అంతేకాదు తన ఆస్తినంతా ఆమె పేరున రాసి కుమారుడికి గట్టి గుణపాఠం చెప్పాడు షాజి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -