Thursday, March 28, 2024
- Advertisement -

దట్ ఈజ్ అల్లు వారు…….. శిరీష్‌కి మరో హిట్ ఖాయం….. ఒక్క క్షణం ట్రైలర్ రివ్యూ

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన అందరు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కుటుంబాల నుంచి కూడా వారసులు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి మాత్రమే ఎంట్రీ ఇచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా గౌరవం చూసినవాళ్ళు అందరూ కూడా అల్లు శిరీష్ మరో తారకరత్న అవడం ఖాయం. హీరోగా నిలబడలేడు అన్నారు. కానీ చిరంజీవిని మెగాస్టర్‌గా నిలబెట్టిన అల్లు అరవింద్…..పవన్‌తో సహా అందరి కెరీర్స్‌ని ప్లాన్ చేసిన అల్లు అరవింద్…..అల్లు శిరీష్‌ని కూడా నిలబెట్టేశాడు. ఇంతకుముందు రిలీజ్ అయిన శిరీష్ సినిమాలు కూడా లాభాలు తెచ్చినప్పటికీ ఈ సారి మాత్రం నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే డ్యాన్స్‌లు, ఫైట్స్‌లో కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు. తాజాగా రిలీజ్ అయిన ఒక్క క్షణం ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాతో అల్లు శిరీష్ హిట్ కొట్టడంతో పాటు తనను తాను హీరోగా నిలబెట్టుకోవడం కూడా ఖాయంగా కనిపిస్తుంది.

ఒక్క క్షణం సినిమా కథ ఒక కొరియన్ సినిమాకు కాపీ. హీరో, హీరోయిన్స్ ప్రేమలో పడిన తర్వాత వాళ్ళకు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటా అని తరచి చూసే క్రమంలో గతంలో మరో జంటకు కూడా ఇలాంటి సంఘటనలే ఎదురయ్యాయని తెలుస్తుంది. ఆ జంటది విషాద ముగింపు. మరి ఈ జంటది కూడా విషాద ముగింపే అవుతుందా? తన ప్రేయసిని కాపాడుకోవడం కోసం ఆ విధితో కూడా హీరో ఫైట్ చేయగలిగాడా? అసలు ఈ రెండు జంటలకూ వచ్చిన సమస్య ఏంటి అన్నది కథ. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో రెండు జంటలనూ చూపించేశాడు డైరెక్టర్. ఒక జంట అల్లు శిరీష్, సురభి అయితే…..మరో జంట అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్. ట్రైలర్‌ల గ్లామర్ డోస్ కూడా గట్టిగానే చూపించాడు. ఇక ఫన్‌తో పాటు ఫైట్స్, హీరోయిజంతో ట్రైలర్‌ని ఇంట్రెస్టింగ్ మిలిచాడు డైరెక్టర్. ఇంతకుముందు ఎక్కడికి పోతాావు చిన్నవాడా సినిమాతో హిట్ కొట్టిన ఆనంద్ ఇప్పుడు ఈ ఒక్క క్షణం సినిమాతో కూడా హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. అలాగే అల్లు శిరీష్‌ని నటుడిగా కూడా నిలబెట్టేలా ఉన్నాడు. ట్రైలర్‌లో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫితో పాటు టెక్నికల్ అంశాలన్నీ కూడా చాలా క్వాలిటీతో రిచ్‌గా ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుండడంతో పాటు సినిమా చూడాలన్న ఆసక్తిని కూడా క్రియేట్ చేస్తోంది. గుడ్ గోయింగ్ శిరీష్…….

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -