Tuesday, April 16, 2024
- Advertisement -

అమలాపాల్ కి నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ?

- Advertisement -

మామూలుగా సినీ స్టార్లు నెలకి ఎంత డబ్బులు ఖర్చు పెడతారు అనే విషయం తెలుసుకోవాలని ప్రేక్షకులకు ఆసక్తి ఉండటం సహజం. అయితే సౌత్ బ్యూటీ ఈ విషయమై స్పందించి తనకి నెలకి ఎంత ఖర్చవుతుందో చెప్పి అందరినీ షాక్కు గురి చేసింది. చేతిలో బోలెడు ఆఫర్లు, షూటింగ్ తో వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న అమలాపాల్ నెలకి 20,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టాదట. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి పదిహేడేళ్ల అప్పుడు వచ్చానని అప్పుడు ఏమీ తెలియక పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పింది.

ఇక దర్శకుడు ఎ.ఎల్.విజయ్ తో విడాకులు తీసుకున్న తరువాత ఆమె చాలా లోన్లీ గా ఫీలయ్యేదట. ఆ సమయంలో ఎక్కడికైనా పారిపోవాలని అనిపించిందని, అప్పుడే ఒక నాలుగు రోజుల పాటు ఆమె హిమాలయాలకు వెళ్లిందట. “ఆ ట్రిప్ తర్వాత నా జీవితం మొత్తం మారిపోయింది. చాలా మామూలుగా బతకడం ప్రారంభించాను. బ్యూటీ పార్లర్ కి వెళ్ళటం ఆపేశాను. నాకు నెలకి మహా అయితే ఇరవై వేలు ఖర్చు అవుతుంది అంతే. జీవితంలో మార్పు చాలా సహజం అలాంటి మార్పు రాకపోయి ఉంటే నేను ‘ఆమె’ లాంటి సినిమాల్లో నటించి ఉండలేక పోయేదాన్ని ఏమో” అని చెప్పుకొచ్చింది అమలాపాల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -