Tuesday, May 14, 2024
- Advertisement -

పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌…

- Advertisement -

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆర్మీ చీఫ్ కౌంట‌ర్ ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడి భారత్‌ ఇంటి పనేనని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ దీటుగా తిప్పికొట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్‌ పాత్రపై భారత్‌ పూర్తి ఆధారాలను పాక్‌కు ఇచ్చిందని చెప్పారు. కాశ్మీర్ ఇవాలా ఆర్మీ చీఫ్ ప‌ర్య‌టించారు. 1999లో కార్గిల్ యుద్ధానికి పాల్ప‌డిన పాకిస్థాన్ పెద్ద త‌ప్పు చేసింద‌న్నారు.

భ‌విష్య‌త్తులో ఇలాంటి దుస్సాహాలు చేయ‌రాదు అంటూ ఆర్మీ చీఫ్ రావ‌త్ పాకిస్థాన్‌ను హెచ్చ‌రించారు. పుల్వామా ఉగ్ర‌దాడికి సంబంధించి భారత నిఘా సంస్ధలు పుల్వామాలో ఏం జరిగిందనేది ఆధారాలతో సహా అందించాయని..ఇంతకంటే తాను ఏమీ చెప్పలేనని ఆయన వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -