Friday, May 3, 2024
- Advertisement -

అమలా చెప్పిన సెక్స్ రాకెట్‌లో తెలుగు టాప్ రేంజ్ స్టార్ హీరోయిన్ కూడానా?

- Advertisement -

తనను వేధిస్తున్న సెక్స్ రాకెట్ గురించి నిర్భయంగా బయటపెట్టేసింది అమలా పాల్. స్పెషల్ డిన్నర్ మీటింగ్ అంటూ భారీ ఆఫర్ ఇచ్చారు అమలా పాల్‌కి. అంత స్పెషల్ ఏంటి అన్న అమలాపాల్‌తో…..‘చిన్న పిల్లలా మాట్లాడకు…….ఆ మాత్రం తెలీదా…..’ అంటూ పరాచికాలాడారు సెక్స్ రాకెట్ గ్యాంగ్. ఈ విషయాలన్నీ స్వయానా అమలానే డైరెక్ట్‌గా మీడియాకు చెప్పేసింది. అయితే ఈ రాకెట్ గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అమలా పాల్ పోలీసులతో మరికొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుందని తెలుస్తోంది.

ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాలకు నో చెప్పడంతో సెక్స్ రాకెట్ సూత్రధారులు అమలాని కన్విన్స్ చేయడానికి కొన్ని విషయాలు చెప్పారట. ఇప్పటికే ఆ సెక్స్ రాకెట్‌లో ఉన్న హీరోయిన్స్ పేర్లు కూడా చెప్పారట. వాళ్ళు చెప్పిన పేర్లలే తెలుగులో అందరు స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన హీరోయిన్ పేరు కూడా ఉందట. ఇప్పటికీ ఆ హీరోయిన్ వరుసగా తెలుగు సినిమాల్లో కనిపిస్తూనే ఉంది. ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాల్లో యాక్ట్ చేసిన ఆ హీరోయిన్ దశాబ్ధంపైగా తెలుగు సినిమాల్లో తన హవా కొనసాగిస్తూ ఉంది. తమిళ్‌లో కూడా ఈ హీరోయిన్‌కి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఈ స్టార్ హీరోయిన్‌తో పాటు మరికొంతమంది పేర్ల లిస్ట్ కూడా అమలా పాల్ పోలీసులకు ఇచ్చిందని తెలుస్తోంది. అలాగే ఈ సెక్స్ రాకెట్ వెనకాల కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ జనాలతో అస్సలు సంబంధం లేకుండా టాప్ రేంజ్ స్టార్ హీరోయిన్స్‌తో సెక్స్ రాకెట్ నడపడం అంత ఈజీకాదని చెప్తున్నారు. మొత్తానికీ సుచీలీక్స్ తరహాలోనే ఇప్పుడు ఈ సెక్స్ రాకెట్‌లో కూడా ఇంకా ఎంతమంది పేర్లు బయటికి వస్తాయో చూడాలి మరి. తమిళ్ సినిమా జనాలను వణికించించడంతో పాటు తెలుగు సినిమా జనాల్లో కూడా భయం పుట్టించిన సుచీలీక్స్ తరహాలోనే ఈ సెక్స్ రాకెట్ కూడా ఎంత సంచలనం అవుతుందో అని ప్రస్తుతం ఇండస్ట్రీ జనాలు అయితే చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -