Wednesday, May 22, 2024
- Advertisement -

బ్రేకింగ్ః పవన్ కళ్యాణ్ ఎవడు? ఎవడో నాకు తెలియదుః బాలకృష్ణ

- Advertisement -

ఒక వైపు పవనేమో బాబుగారి పంచన చేరి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ‘జెండా పీకేద్దాం’ లాంటి సంచలన వార్తా కథనాలతో ప్రజారాజ్యంని చంపేసిన పచ్చ మీడియాకు ఐటెం అవుతున్నాడు. అలాగే ప్రజారాజ్యం పార్టీలో తన గూఢచారులను చేర్చి శల్యసారథ్యం చేయించిన చంద్రబాబుకు జై కొడుతున్నాడు. తెరవెనుక ప్యాకేజ్ వ్యవహారాలు ఎలా ఉన్నా పవన్ చర్యలు మాత్రం చిరంజీవి అభిమానులతో పాటు, వర్గ ప్రజలు కూడా కొంతమంది సహించలేకపోతున్నారు. ఇక టిడిపి నేతలు కూడా కొన్ని సార్లు పవన్‌ని మరీ బఫూన్‌ని చేస్తున్నారు. చంద్రబాబు కూడా పవన్‌పైన అడపాదడపా పంచ్‌లు వేస్తున్నాడు. ఏమీ తెలియని కొత్త సేద్యగాళ్ళు, అన్ని లెక్కలూ వెబ్‌సైట్‌లో ఉన్నా చూడలేరా అంటూ పవన్‌పై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు లాస్ట్ పంచ్ అన్నట్టుగా బాలయ్య ఇంకా సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. రీసెంట్‌గా పవన్ సినిమా అజ్ఙాతవాసితో తన జైసింహా సినిమాను పోటీకి పెట్టాడు బాలయ్య. బాలయ్య సపోర్టర్స్, ఆయన వర్గం అంతా కలిపి అజ్ఙాతవాసిపై భారీ స్థాయిలో నెగిటివ్ ప్రచారం చేశారని మెగా వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పుడు బాలయ్య ఏకంగా……‘పవన కళ్యాణా? ఎవడు వాడు? పవన్ ఎవడో నాకు తెలియదు’ అనే స్థాయిలో మాట్లాడేయడం సెన్సేషన్ అవుతోంది. పవన్ హార్డ్ కోర్ అభిమానులను కూడా ఇరిటేట్ చేస్తోంది. అనంతపురంలో పవన్ కూడా పోటీ చేస్తున్నాడు కదా……మీ స్పందన ఏంటి అని బాలయ్యను కొంతమంది జర్నలిస్టులు అడిగారు. ఆ మాత్రం దానికే రెచ్చిపోయిన బాలయ్య……‘పవన్ కళ్యాణా…..హూ ఈజ్ హి….ఐ డోంట్ నో హూ హీ ఈజ్’ అంటూ ఇంగ్లీషులోనూ తెలుగులోనూ రెచ్చిపోయాడు. చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం అని నాకు తెలియదా అని ఆ మధ్య పవన్ కళ్యాణ్ రాగం తీశాడు. తాజా పరిణామాలు చూస్తుంటే టిడిపి వర్గాలే పవన్‌ని టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పూనం కౌర్, మహేష్ కత్తి వ్యవహారాల్లో కూడా టిడిపికి పూర్తి స్థాయి సపోర్టర్స్ అయిన టివి9, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు పవన్‌ని పూర్తిగా బదనాం చేసే స్థాయిలో వార్తలు వండి వార్చిన విషయం తెలిసిందే. రోజుల తరబడి మహేష్ కత్తిని స్టూడియో కూర్చుపెట్టించి పవన్‌ని తిట్టించారు. ఇప్పుడు చంద్రబాబు బంధువు, టిడిపి ముఖ్య కుటుంబ సభ్యుడు అయినా బాలయ్య…….పవన్ కళ్యాణా? ఎవడు వాడు? వాడెవడో నాకు తెలియదు అనే స్థాయిలో మాట్లాడడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -