భారతదేశంలో కుబేరుడైన అంబానీ ఇంట్లో పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా..?44 బిలియన్ డాలర్ల ఆస్తిమంతులైన అంబానీల ఇంట పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో ఎవరికి ఊహాకు కూడా అందడం లేదు.ముఖేష్ అంబానీ ముద్దుల కూతురు ఇషా అంబానీ పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అన్ని హైరేంజ్‌లోనే జరుగుతున్నాయి.పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్స్ మొత్తన్ని రప్పించి ఓ సంగీత్‌ను ఏర్పాటు చేయించారు అంబానీ ఫ్యామిలీ.సంగీత్ వేడుక కోసం ముంబై- బాంద్రా మొత్తం ఖాళీ చేయించిన ఘనత అంబానీలకే చెందుతుంది. సెలబ్రిటీల్ని గంపగుత్తగా ఉదయ్పూర్ కి తరలించిన మొనగాడు ముఖేష్ అంబానీ. కూతురి పెళ్లి వేడుకలో బాలీవుడ్ అగ్రకథానాయకులు సహా టాప్ స్టార్లంతా డ్యాన్సులాడి తెగ హంగామా సృష్టించారు.
ఈ పెళ్లికి వరల్డ్ బెస్ట్ పాప్ సింగర్ బియాన్స్‌తో కూడా ఓ ప్రొగ్రామ్ చేయిస్తున్నారని సమాచారం.దీని కోసం బియాన్స్‌కు 20 కోట్లు చెల్లించారని వినికిడి.ఇక ఈషా అంబానీ పెళ్లికూతురు గౌను ఖరీదు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.ఈషా అంబానీ పెళ్లి రోజున ధరించనున్న గౌను ఖరీదు అక్షరాలు 90 కోట్లట.స్పెషల్‌గా డిజైన్ చేయించిన ఈ గౌన్‌లో చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి.24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ తో శారీని బ్లౌజును డిజైన్ చేయించేందుకు ఇంత ఖర్చు చేశారట. ఇదే తరహా డ్రెస్ని కోడలు శ్లోకా మెహతా కోసం వేరొకటి డిజైన్ చేయించారని తెలుస్తోంది. కూతురు పెళ్లి కోసం అంబానీ 1000 కోట్లుకు పైగానే ఖర్చు పెడుతున్నారని సమాచారం.

- 30 ఏళ్లకే గుండెపోటు..కారణాలు & జాగ్రత్తలు!
- విజయ్ స్థానంలో లారెన్స్..పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
- కోహ్లీపై వైభవ్ షాకింగ్..వీడియో!
- వైసీపీ నేతలే టార్గెట్గా అక్రమకేసులు!
- నిస్వార్ధంగా పని చేసినా గుర్తింపు లేదు..టీడీపీ నేత ఆవేదన
