బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా ఇప్పటికే పెళ్లి అయి ,పిల్లలు కూడా ఉన్న సంగతి తెలిసిందే.ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని చాల కాలం అయింది.బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అన్న అబ్బాస్ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది మలైక.తరువాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయారు.భర్తతో విడిపోయిన తరువాత నుంచి యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఎఫైర్‌లో ఉందని చాలకాలం నుంచి వార్తలు వస్తున్నాయి.అసలు అర్జున్ కపూర్‌తో ఎఫైర్ వల్లే మలైక భర్తకు విడాకులు ఇచ్చిందని వార్తలు వచ్చాయి.ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి తిరగడం, విదేశాల్లో చక్కర్లు కొట్టడం చూస్తుంటే వీరి మధ్య రిలేషన్ నిజమని అనిపిస్తుంది.
ఇటీవల ఈ జంట ముంబైలో ఖరీదైన ఇంటికి కూడా తీసుకున్నారని సమాచారం.అర్జున్ కపూర్ వీరి బంధం గురించి అడగ్గా అలాంటిది ఏం లేదని బదులిచ్చాడు.అయితే మలైక మాత్రం నేను సింగిల్‌గా లేనని చెప్పుకొచ్చింది.దీంతో వీరి మధ్య ఎలాంటి బంధం ఉందో అందరికి అర్థం అయింది.తాజాగా తమ రిలేషన్ గురించి మరోసారి బయటపెట్టింది మలైక.తమ బంధాన్ని ఓ లాకెట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. తమ మెడలోని చైన్ కి ఉన్న లాకెట్ ఫోటోని షేర్ చేసింది. దాని మీద ‘ఏఎం’ అని ఉంది. ఏ అంటే అర్జున్ కపూర్, ఎం అంటే మలైకా అరోరా అనేది ఈ ఫోటో సందేశమని స్పష్టమవుతోంది. గతంలో కూడా కొందరు సెలబ్రిటీలు తమ ప్రేమలను ఇలా వ్యక్తపరిచారు.మరి బంధం పెళ్లి వరకు వెళ్తూందో లేదో చూడాలి.