Saturday, May 18, 2024
- Advertisement -

బిగ్‌బాస్ :అమిత్ చేసిన ప‌నికి ఏడ్చేసిన గ‌ణేశ్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ రోజు రోజుకి ఆక‌ట్టుకుంటుంది.నిన్న(సోమవారం) జ‌రిగిన ఎపిసోడ్‌లో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చోటు చేసుకున్నాయి.ఈ వారం ఎలిమినేష‌న్‌లో భాగంగా బిగ్‌బాస్ హోస్‌మెట్స్‌ని ఎవరితో మీకు మాట్లాడడం ఇష్టం లేదో ఏకాభిప్రాయంతో ఒకరి పేరుని చెప్పాలని అన్నారు. అందరూ చర్చించుకొని అమిత్ పేరు చెప్పారు. అంద‌రికంటే ముందు గ‌ణేశ్ లేచి అమిత్ పేరు చెప్ప‌డంతో అమిత్ నేరుగా ఎలిమినేష‌న్ ఎంపిక అయ్యాడు.

అయితే ఈ ఎలిమినేషన్ నుండి తప్పించుకోవడానికి బిగ్ బాస్ అమిత్ కు ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు.ఈ టాస్క్ లో అమిత్ ఒకరి వంట చెడగొట్టాలి, ఓ కంటెస్టెంట్ నెత్తిపై గుడ్డు కొట్టాలి, దీప్తి సునయనను ఏడిపించాలి, ఓ కంటె స్టెంట్ ప్యాంట్, షర్ట్ , షూస్ స్విమ్మింగ్ పూల్ లో వేయాలి, ఓ హౌస్ మేట్ ను డైనింగ్ టేబుల్ మీద డాన్స్ చేసేలా చేయాలి. ఇవన్నీ ఎవరికీ తెలియకుండా చేయాలి.గణేష్ నెత్తిపై గుడ్డుని పగలగొట్టాడు.ఈ అనుహ్య సంఘ‌టన‌తో షోలోని హోస్‌మెట్స్ అంద‌రు షాక్ గురైయ్యారు. అమిత్ ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు.అమిత్ ప్రవర్తనతో షాక్ అయిన గణేష్ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.

అప్ప‌టికి దీప్తి సీక్రెట్ టాక్ ఏమో అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బాత్రూంలోకి వెళ్లి మ‌రి ఏడ్చేశాడు.దీంతో అమిత్ ఓ కెమెరా ముందుకు వచ్చి వీళ్లంతా నన్ను అర్ధం చేసుకోవడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు.టాస్క్ ఓడిపోయినా పర్వాలేదని గణేష్ దగ్గరకి వెళ్లి హౌస్ మేట్స్ అందరికీ ఉన్న విషయం చెప్పేశాడు. అయినా బిగ్ బాగ్ మాత్రం అమిత్ ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నాడని ప్రకటించడం విశేషం. చూసే జ‌నాలు మాత్రం షో అంటే ఎంజాయ్ చేసే విధానంగా ఉండాలి కాని ,వాళ్ల ఏడుపులు మాకు ఎందుకు అనుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -