Thursday, May 2, 2024
- Advertisement -

వర్మ ‘మర్డర్’ సినిమా ఘాటుగా స్పందించిన అమృత..!

- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫాదర్స్ డే సందర్భంగా నిన్న ‘మర్డర్’ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ను రిలీజ్ చేశాడు. ప్రణయ్, అమృతల ప్రేమ వ్యవహారం, కిరాయి మూకలతో మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమాని వర్మ తెరకెక్కిస్తున్నారు. అయితే తన కథ ఆధారంగా వర్మ తీస్తున్న ఈ మర్డర్ సినిమాపై అమృత స్పందించారు. వర్మ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూడగానే తనకు సూసైడ్ చేసుకోవాలనిపించిందని అమృత అన్నారు.

ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన లైఫ్ తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తప్పా? అని ప్రశ్నించారు. ఈ ఒక్క ఘటన వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న సమయంలో వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడిందని, అయితే, దీనిని ఎదుర్కొనేంత శక్తి తనకు లేదని, ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావడం లేదని అన్నారు. వర్మ పోస్టర్ రిలీజ్ చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోతున్నానని చెప్పారు.

కొడుకుతో ప్రశాంతంగా బతుకుతున్న తన లైఫ్ ని బజారున పెట్టొద్దని వేడుకున్నారు. తమ పేర్లను ఉపయోగించి వర్మ తప్పుడు కథను అమ్ముకోవాలని చూస్తున్నాడని అన్నారు. రెండు నిమిషాల పేరు కోసం వర్మ లాంటి ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఊహించలేదన్నారు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తోందని అన్నారు. తన కథ ఆధారంగా సినిమా తీస్తున్న వర్మపై కేసు వేయడం లేదని, ఎందుకంటే ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడేనని అన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదని పేర్కొన్న అమృత చివర్లో ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ముగించారు.

నాగార్జున, అమల వెడ్డింగ్ అనివర్సరీ డే సెలబ్రేషన్స్..!

అఫర్ కావాలంటే సుఖం ఇవ్వాలి అన్నారు : తేజస్వి

శ్రీముఖి లవర్ దొరకుడు.. విష్ణుప్రియ కామెంట్స్..!

డైరెక్టర్ సుకుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -