Thursday, May 2, 2024
- Advertisement -

సినిమాల‌కు బై.. బై చెప్పేసిన హాట్ బ్యూటీ

- Advertisement -

సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో సెగ‌లు రేపిన హాట్ బ్యూటీ అమీ జాక్స‌న్‌. అమీ జాక్స‌న్ కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను రెచ్చ‌గొట్టింది. పెద్ద పెద్ద హీరోల‌తో అతి త‌క్కువ స‌మ‌యంలోనే సినిమాలు చేసిన హీరోయిన్ అమీ జాక్స‌న్‌. ప్ర‌స్తుతం అమీ రెండు మూడు సినిమాల్లో న‌టిస్తోంది. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న 2.0 సినిమాలో న‌టిస్తోంది. ఆ సినిమా రోజురోజుకు వాయిదా ప‌డుతోంది. అయినా ఆ సినిమా కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తోంది.

దీంతో పాటు ప్రస్తుతం ఆమె ఒక ఇంగ్లిషు సీరియల్‌లో నటిస్తోంది. అయితే ఇక ముందు సినిమాలు చేయ‌లేన‌ని తేల్చి చెప్పింద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు బాగా లేక‌పోవ‌డంతో తాను సినిమాల‌కు దూరం అవుతాన‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తుంది. సినిమాల‌కు టాటా చెప్పేసి కెన‌డాలో లేదా మొర‌కాలో సెటిల్ అవుతుంద‌ని చెప్పింది. ఆమెకు అక్క‌డేం ప‌ని అంటున్నారా? ఆమెది కెన‌డానే.

అమీ జాక్స‌న్ కెనడా దేశ‌స్తురాలు. ద‌ర్శకుడు విజయ్ దృష్టిలో పడి ‘మదరాసు పట్టణం’ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ వ‌చ్చింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అమీ ఎందుకో సినిమాలు చేయ‌న‌ని చెప్పేసింది. మొరాకోలో లేదా కెన‌డాలో స్థిర ప‌డాల‌ని నిర్ణ‌యించుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -